ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తా
హుస్నాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు కరీంనగర్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి, ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఆలయ నిర్మాణానికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారన్నారు.