సిద్దిపేట: కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటాలు
కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటాలు కలిగిన చరిత్ర ఏఐటీయూసీకి మాత్రమే దక్కిందని ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు అందె అశోక్ గురువారం అన్నారు. కార్మిక సంఘం 105వ ఆవిర్భావ దినోత్సవము సందర్భంగా కార్మిక సంఘం జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడుతూ ఏఐటీయూసీ భారతదేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా ఉద్భవించిందని, కార్మిక సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేసి 44 కార్మిక చట్టాలను సాధించిపెట్టిన ఘనత సంఘానికే దక్కిందన్నారు.