ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం ధన్వాడ మండల పరిషత్, తాసిల్దార్, మండల మహిళా సమాఖ్య కార్యాలయాలను సందర్శించారు. ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు.