Nov 25, 2024, 09:11 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
ధన్వాడ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
Nov 25, 2024, 09:11 IST
ధన్వాడ మండలం కిస్టాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పీడీఎస్యు నాయకులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. అనంతరం హెడ్మాస్టర్ తో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్, నాయకులు పరుశురాం, ప్రవీణ్, రమేష్ పాల్గొన్నారు.