గిరిజన విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశంచారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల నుంచి విద్యార్థులు ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లకు వెళ్లకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఆర్సీఓ నాగార్జునరావు, ఎస్టీసీ రవీంద్రనాథ్ కలిసి దర్బారు నిర్వహించారు.