అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న బెల్టు షాపులను ఎత్తివేయాలని జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు జాన్వి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణను కలిసి ఆమె వినతి పత్రం అందించారు. 24 గంటల పాటు బెల్టు షాపులో మద్యం అందుబాటులో ఉండడంతో యువత మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.