కోరుట్ల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1998 నుండి 2001 విద్యా సంవత్సరంలో డిగ్రీ చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని, ఆట పాటలతో, ఆనందోత్సహాలతో ఉల్లాసంగా గడిపారు. 23 సంవత్సరాల తరువాత కలిసిన అపూర్వ కలయిక ఎంతో ఆనందాన్ని నింపిందని అన్నారు.