మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం, అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో స్పోక్స్ పర్సన్ డాక్టర్ విద్యాసాగర్ కోరారు. శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుఅత్యంత కీలకమైనదని అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలన్నారు.