సదాశివనగర్ లో విత్తన ఉత్పత్తి, మార్కెటింగ్ లో సొసైటీల భాగస్వామ్యం పెంచడానికి గురువారం అభిప్రాయ సేకరణ చేసినట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డి అన్నారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం బీజ ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేసి వాటిలో సొసైటీల సభ్యత్వం పొందేలా చూస్తామన్నారు.