నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఉపాధ్యాయులు
బాన్సువాడ పట్టణంలోని బాలుర, బాలికల పాఠశాల, మండలంలోని బోర్లం, కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ డి ఏ లు, పిఆర్సి ని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరసింహ చారి, నరేంద్రనాథ్ ఆర్య, వేద ప్రకాష్, ప్రసాద్, రాముల, శ్రీకాంత్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.