రోడ్ల అక్రమాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్రమ పార్కింగ్, రోడ్లను ఆక్రమించుకుని చేసే వ్యాపారలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ హరి ప్రసాద్ అన్నారు. బంజారాహిల్స్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. టోటల్ ఆక్రమించుకొని వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులకు తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.