ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ లో భద్రత పటిష్టంగా ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంలను భద్రపరిచిన గోదాముల తనిఖీలలో భాగంగా గురువారం వనపర్తి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈవీఎం గోదాము భద్రతకు నియమించిన సిబ్బంది హాజరు, బందోబస్తు, తదితర అంశాలను పరిశీలించారు.