ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని చెట్లు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. గంగోత్రి జాతీయ రహదారి నుంచి సుంగర్ సమీపంలో భారీగా బండరాళ్లు వాహనాలపై పడటంతో అవి ధ్వంసమయ్యాయి. పలువురి ప్రాణాలు పోయినట్లు సమాచారం. గడిచిన 24 గంటల్లో ధనౌరిలో 223 మి.మీ, అషరోరిలో 207 మి.మీ, రిషికేశ్‌లో 193, గర్హ్వాల్ పర్వత ప్రాంతంలో 200 మి.మీ, భగవాన్‌పూర్‌లో 169 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.