డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. 'మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం బాధాకరం. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించండి' అని అన్నారు.