ఇన్‌స్టంట్ నూడిల్స్‌కు మ్యాగీ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా?. మ్యాగీ ఆవిష్కర్త పేరు జూలియస్ మైఖేల్ జోహన్నెస్ మ్యాగీ. ఫ్యాక్టరీ కార్మికుల కోసం జూలియస్ అతి తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన భోజనం అందించాలని అనుకున్నాడు. అప్పుడే సూప్, ముందుగా వండిన ఆహారంతో ఓ మిశ్రమాన్ని సృష్టించాడు. ఆ ఆహారాన్ని అందరూ రుచిగా తినడం మొదలుపెట్టారు. బిజినెస్ మెల్లమెల్లగా డెవలప్ అయింది. అతడి పేరు మీదే మ్యాగీని మార్కెట్‌లో తీసుకొచ్చాడు.