ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉందని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా నైజీరియా, ఇండోనేసియా, చైనా ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో ఏటా 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది.