రాగి జావతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావతో విటమిన్ సీ, విటమిన్ ఈ, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. రాగి జావ వల్ల జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.