దొంగతనం కేసులో దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపురం గ్రామానికి చెందిన వెంకటేష్ కు 18 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధించినట్లు వేములవాడ సిఐ వీరప్రసాద్ తెలిపారు. గత ఏడాది ఆగస్టు 15న వేములవాడలో ఎల్లయ్య షాపులోని నగదు కౌంటర్ లో నుంచి వెంకటేష్ రూ. 50 వేలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో రుజువు కావడంతో జడ్జి జ్యోతిర్మయి శిక్ష విధించారు.