తాంసి మండలంలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధుల హాజరు శాతం, మధ్యహ్నం భోజనాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి భోజనం తయారు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్ధులతో మాట్లాడి పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.