భీమడోలు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా ఉండాలి
భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలోని ధాన్యం కొనుగోళ్ళు పక్రియను సోమవారం జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గోనె సంచుల నాణ్యతను, ధాన్యాన్ని భద్రపరుస్తున్న విధానాన్ని ఆమె సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని భీమడోలు తహసీల్దార్ రమాదేవికి సూచించారు.