ఏలూరు జిల్లాలో విషాదం
ఏలూరు జిల్లాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామ శివారులోనే పోలవరం కుడి కాలువలో బుధవారం ముగ్గురు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. పందెం కోళ్లకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఘటనలో శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (50), శెట్టిపల్లి మణికంఠ (16), శెట్టిపల్లి సాయికుమార్ (13) గా గుర్తించారు. మృతదేహాల కోసం కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.