బీమవరం: నవంబరు నుంచి నైపుణ్య గణన - జిల్లా కలెక్టర్
నవంబర్ మొదటి వారం నుండి జిల్లాలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సెస్)కు సర్వే చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నైపుణ్య గణన దేశంలోనే తొలి సారి మన రాష్ట్రంలో చేయబోతున్న ఒక గొప్ప ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు దీని కోసం మాస్టర్ ట్రైనర్ల ఎంపిక ఇప్పటికీ పూర్తి చేసినట్లు తెలిపారు.