నరసాపురం మండలంలోని మంగళగుంటపాలెంలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను ప్రస్తుత ప్రభుత్వం "మన ఇల్లు-మన గౌరవం"గా మార్పు చేసినట్లు మున్సిపల్ సిబ్బంది గంధం ప్రసాద్ తెలిపారు. సోమవారం నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం. అంజయ్య లే అవుట్ ప్లానింగ్ పర్యవేక్షించగా, ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.