ఏలూరు జిల్లాలో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి నిత్యవసర వస్తువులు పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. దాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే పామాయిల్, సన్ ఫ్లవర్ తక్కువ ధరతో అందించే 32 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ధరలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నామన్నారు.