ఉండి: తల్లి డబ్బులు ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య
ఉండిలోని గణపవరం రహదారి ప్రాంతానికి చెందిన మాధవకుమార్ (22) పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగించేవారు. ఈ నెల 21న తన తల్లికి ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలని కోరగా ఆమె నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 22న కలుపు నివారణ మందు తాగడంతో స్థానికులు అతడ్ని భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.