నగరి: దోపిడి ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
చిత్తూరు జిల్లా, నగరి మండలం తడుకుపేటలో రెండు రోజులు క్రితం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి సెల్ఫోన్లు చోరీ చేసిన కేసులో తమిళనాడుకు చెందిన వేలు, బాలచంద్, విజయ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు సీఐ మహేశ్వర్ శుక్రవారం తెలిపారు. అదేవిధంగా ఈ నెల 1 న తడుకుపేట జగనన్న కాలనీ వద్ద కత్తి చూపి రూ. 2 వేలు దోపిడి చేసిన కేసులో హుస్సేన్, నరేంద్రన్, అజిత్ ను అరెస్టు చేశారు.