ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నట్లు జిల్లా అధికారులు ఆదివారం తెలిపారు. విమానాశ్రయం నుండి రోడ్ షో ద్వారా ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసే సభకు హాజరవుతారు. అక్కడ నుండి ఎన్ టి పి సి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నిర్మాణంకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూలు రావాల్సి ఉందన్నారు. సభా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలిస్తున్నారు.