విశాఖలో లా స్టూడెంట్ పై జరిగిన అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత మంగళవారం స్పందించారు. విశాఖ పోలీస్ కమీషనర్ తో ఫోన్ లో మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని పేర్కొన్నారు.