కొయ్యూరు మండలంలోని చింతలపూడిలో సోమవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ తాటాకిల్లు పూర్తిగా దగ్ధమై సుమారు మూడు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన నూకరాజు తాటాకిల్లు ఆకస్మికంగా అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోగా, ఇంట్లో సామగ్రి, తిండి గింజలు, ధ్రువపత్రాలు, నగదు సర్వం అగ్నికి ఆహుతై బాధిత కుటుంబీకులు కట్టుబట్టలతో మిగిలారు.