ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న ముగ్గురు గాయనీమణులతో ‘వేణు గానమ్ము వినిపించెనే’ శీర్షికన తలపెట్టిన సినీ సంగీత విభావరి పోస్టర్ను విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆవిష్కరించారు. సోమవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు పాల్గొన్నారు.