అనంతగిరి మండలంలో గల ఎన్.ఆర్.పురం గ్రామ సచివాలయాన్ని గురువారం ఎంపీడీవో కుమార్ సందర్శించారు. ముందుగా అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ ఎన్పీసీఐ లింక్ కానీ ప్రతి రైతుకు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కు వెళ్లి లింక్ చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. హౌస్ హోల్డ్ సర్వే సచివాలయ సిబ్బంది నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.