తెదేపా కార్యకర్తలకు అండగా ఉంటానని నియోజకవర్గ ఇన్ ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. అచ్చుతాపురం మండలంలో దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి కాళ్ల రాజుబాబు తండ్రి అప్పలనాయుడు మృతిచెందడంతో బాధిత కుటుంబ సభ్యులను ఆయన శనివారం పరామర్శించారు. తెదేపా తరుపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. మండల తెదేపా మహిళా అధ్యక్షురాలు శాంతి , రాజు తదితరులు పాల్గొన్నారు.