అనంతగిరి: ఆదివాసీలకు డోలి మోతల తిప్పలు తప్పడం లేదు.
అనంతగిరి మండలంలో ఓ నిండు గర్భిణీని కొండ శిఖర గ్రామం నుండి డోలి సహాయంతో హాస్పిటల్ కు తరలించిన సంఘటన పలువురిని కలచివేశాయి, గుమ్మ పంచాయతీ పరిధిలో గల కర్రి గోడ గ్రామానికి చెందిన కొర్ర రాధ(25) గర్భిణీకి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెను డోలి సహాయంతో సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరించారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామానికి చెందిన గిరిజనులు కోరుతున్నారు.