విశాఖ: కూటమి ప్రభుత్వం వచ్చాక వీధిన పడ్డ కార్మికులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ జీవీఎంసీలో తోపుడుబండ్లు కార్మికులపై దాడులు పెరిగాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్ వి కుమార్ అన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తోపుడు బండ్లు చిల్లర వర్తకుల పై జీవీఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ ఇతర అధికారులు ఈ రకమైన దాడులు చేయడం సరికాదని విమర్శించారు. బుధవారం మద్దిలపాలెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.