ఎస్ కోట మండలంలో భక్తిశ్రద్ధలతో నాగపంచమి పూజలు
నాగపంచమి సందర్భంగా ఎస్ కోట మండలంలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా కుటుంబాల వారీగా సమీప పొలాల్లో గల పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పసుపు, కుంకుమ, గుడ్లు, చిముడు ప్రసాదాన్ని నివేదించి దీపారాధన చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా పుట్ట బంగారాన్ని చెవులకు అలంకరించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా నాగపంచమి పండగ చేసుకోవడం ఆనందంగా ఉందని ప్రజలు తెలిపారు.