ఎస్ కోట మండలం సంత గౌరమ్మపేట రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి రవీంద్ర ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు పై రైతులకు అవగాహన కల్పించారు. నూర్పులు అనంతరం రైతు సేవా కేంద్రాల్లో రైతులు తమ పంటను విక్రయించేటప్పుడు తీసుకోవలసిన నాణ్యత ప్రమాణాలు పాటించి సరైన మద్దతు ధర పొందాలని సూచించారు. గోనె సంచులు, రవాణా, లేబర్ చార్జీలు వివరాలను వివరించారు. కార్యక్రమంలో వి ఏ ఏ రవి, కృష్ణ తదితర రైతుల పాల్గొన్నారు.