జామి మండలంలో పంచాయతీ సిబ్బంది చేపడుతున్న హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీడీవో అప్పలనాయుడు కోరారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ పి సి ఐ సర్వేను త్వరితగతిని పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో గోకులం షెడ్లు, సిసి రోడ్లు నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు తనకు సమర్పించాలని కోరారు.