సైదాపురంలో వాహనాల తనిఖీ
మండల కేంద్రమైన సైదాపురంలో ఎస్ఐ క్రాంతికుమార్ పలు వాహనాలు బుధవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని, హెల్మెట్ లేకుండా, సరైన వాహనాల పత్రాలు లేకుండా తిరిగే వారికీ కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ద్విచక్ర వాహన దారులు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంచుకోవాలని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.