54 ఏళ్ల వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స
కుప్పం చరిత్రలో మొట్ట మొదటిసారిగా కె సి ఆసుపత్రిలో ఫారిన్ ఇంప్లాంట్ అతి తక్కువ ఖర్చుతో చేశామని డాక్టర్ మంజునాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంజునాథ్ మాట్లాడుతూ.. 54 వయసు గల వ్యక్తి 5 సంవత్సరాల నుండి మోకాలి నొప్పితో భాద పడుతూ కే సి హాస్పటల్ కి రావడం జరిగిందని, పరీక్షలు నిర్వహించి ఫారిన్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.