టెక్కలి: ఎండల మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి
టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి శనివారం భక్తుల తాకిడి కనిపించింది. కార్తీకమాసం శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారం పర్వదినం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కోటి సోమవారం రోజున దీపారాధన చేస్తే మంచిది అని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.