స్ధానిక టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాలకు నాడు-నేడు పధకం ద్వారా ప్రభుత్వం కొన్ని వేల కోట్లు రూపాయలు వ్యయం చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం లో విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, కొంత మంది వేసవి సెలవుల్లో కోచింగ్ సెంటర్ల యజమానులు తమ పబ్లిసిటీ పెంచుకోవడానికి పాఠశాల ప్రహరీ గోడలకు తమ కోచింగ్ సెంటర్ల పోస్టర్లను అతికించి పాడు చేస్తున్నారు. ఆ పాఠశాల లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ప్రతిరోజూ శ్రీకాకుళం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు, ఉపాధ్యాయుల ఉదాసీనత కారణంగా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇటువంటి పబ్లిసిటీ వారిని నియంత్రించి, పెనాల్టీ రూపంలో తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.