నందిగాం మండలం రాంపురం పల్లె రహదారి ఈనాటికీ మట్టి రోడ్డు గా మిగిలిపోయింది, ఈ రోడ్డుపై టూవీలర్ ప్రయాణం చేసిన వారు గుంతల్లో గోతులు లో పడి హరే రామ చంద్రా అంటూనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మధ్య పడిన చిన్న చిన్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే మా మీద మాకే అసహ్యం వేస్తుంది అని గ్రామ వాసులు మీడియా ముందు అసహనం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు నుంచి కేటాయించి సిమెంట్ రోడ్డు వేయించాలి అని రాంపురం వాసులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.