పాతపట్నం: లిఫ్ట్ ఇరిగేషన్ ల మంజూరుకు చర్యలు చేపట్టండి
పాతపట్నంలో వ్యవసాయమే జీవనధారంగా రైతులు కష్టపడుతున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఈ క్రమంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడుని శనివారం విజయవాడలో కలసి వినతి పత్రం సమర్పించారు. నూతన ఎత్తి పోతల పథకాలు మంజూరుతో పాటు గతంలో మంజూరై, పాడైపోయిన ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయుటకు చర్యలు చేపట్టాలని విన్నవించారు.