కొత్తూరు: 'ప్రజలపై విద్యుత్ భారాలు వేయవద్దు'
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి, ప్రజలపై భారాలు వేయకూడదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం కొత్తూరు మండలం విద్యుత్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజలపై విద్యుత్ భారం మోపితే ధర్నా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.