కొత్తూరు మండల కేంద్రంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ శనివారం మీడియాతో మాట్లాడారు. 108 ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆపత్కాల సమయాలలో వైద్య సేవలు నిమిత్తం 108 ఉద్యోగులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ప్రభుత్వమే నేరుగా 108 సర్వీస్ ను నిర్వహించాలని అన్నారు.