మందస మండలం చాపరాయి గ్రామంలో సోంపేట ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు సోమవారం సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి ఉపయోగించే 1400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. నాటుసారా సమూలంగా అరికట్టే దిశగా కృషి జరుపుతున్నట్లు సోంపేట ఎక్సైజ్ సీఐ కె. బేబీ తెలిపారు.