కార్తీక మాసం చివరి సోమవారం సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో వంశధార నది తీరాన వెలసిన ఉమా కామేశ్వర స్వామి ఆలయంలో ఓంకారం ఆకారంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా దీపారాధన నిర్వహించారు. ఆలయ వేద పండితులు గంగవరపు వాసుదేవ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు, గ్రామస్థులు సంఖ్యలో పాల్గొని దీపారాధన కార్యక్రమం చేపట్టారు.