అలికాం బత్తిలి రహదారి గుండా కొండవాగు నీరు ప్రవాహం
లక్ష్మీనర్సుపేట మండలం లో అలికాం బత్తిలి ప్రదాన రహదారి పై ఆదివారం కొండవాగు నీరు ప్రవహిస్తోంది కురుస్తున్న వర్షాలకు ఎగువ ఉన్న కొండవాగు నీరు రహదారి పై ప్రవహించడం వాహనచోధకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులు క్రితం కురిసిన వర్షాలకు రహదారి గుండా ప్రవహించి కొవిలాం కాలనీ లోకి ప్రవేశించడం జరిగింది. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి చేతులు దులుపేసుకున్నారని ఆరోపణ విన్పిస్తున్నాయి.