ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాతపట్నం ఎస్ఐ బి. లావణ్య ఆదివారం తన సిబ్బందితో కొరసవాడ, తెంబూరు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించగా కొరసవాడలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఒక మహిళ వద్ద నుంచి 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది ఉన్నారు.