పలాసలో బిసి బాలికల వసతి గృహం, ఎస్టి బాలుర వసతి గృహంలో గల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి. హరీష్, ఉపాధ్యక్షులు సిహెచ్ రాజు మాట్లాడుతూ.. వసతి గృహాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం ఎంపీడీవో హాస్టల్ ను సందర్శించి, విద్యార్థుల సమస్యలను పరిష్కరం చేస్తామని హామీ ఇచ్చారు.